నన్నే నిద్ర లేపుతావా - మహిళా కండక్టర్ పట్ల యువకుడు దురుసు ప్రవర్తన - Youth Misbehaved with bus conductor
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 8:47 PM IST
Youth Misbehaved with Female Bus Conductor: మద్యం మత్తులో కొంతమంది హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ఓ యువకుడు మద్యం మత్తులో మహిళా కండక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడని మహిళా కండక్టర్ కన్నీటి పర్యంతమైంది.
మహిళా కండక్టర్ యువకుడి నిద్ర లేపారని: ప్రకాశం జిల్లా పొదిలిలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. డిపోలో పీకల్లోతు మద్యం సేవించి మహిళా కండక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌ను దూషిస్తూ చేయి సైతం చేసుకున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన ఘటనను తెలుపుతూ మహిళా కండక్టర్ కన్నీటి పర్యంతమైంది. తోటి ప్రయాణికులు గమనించి యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాగుబోతు యువకుడు కనిగిరిలో బస్సు ఎక్కి పొదిలిలో దిగాల్సి ఉండగా కండక్టర్ నిద్ర లేపడంతో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు పొదిలి బస్టాండ్‌లో తరచూ జరుగుతున్నా, అధికారులు పొట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.