మంత్రి అంబటి కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ - యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 5:47 PM IST
Youth Congress Protest at Minister Ambati Camp Office: రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి యువజన కాంగ్రెస్ నేతలు యత్నించారు. మెగా డీఎస్సీ అంటూ ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో మంత్రి అంబటి కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో మరికొంతమంది యువజన కాంగ్రెస్ నేతలు, మంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే, తమపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.