ఇంట్లో మంటలు చెలరేగి యువకుడు మృతి - మస్కిటో కాయిల్ కారణంగానే! - Man Died by Mosquito Coil - MAN DIED BY MOSQUITO COIL
🎬 Watch Now: Feature Video
Published : Sep 1, 2024, 10:14 AM IST
Man Died in Fire Accident in kukatpally : దోమల బెడద నుంచి ఉపశమనం కోసం వెలిగించిన ఓ మస్కిటో కాయిల్ వల్ల మంటలు చెలరేగి కూకట్‌పల్లిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ ఇంట్లో గత నెల 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని బాపట్లకు చెందిన అభిషేక్ అనే యువకుడు, హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. గత నెల 23న కూకట్‌పల్లిలోని తన పెద్దమ్మ కుమార్తె ఇంటికి వెళ్లాడు.
అదే రోజు అర్ధరాత్రి ఇల్లంతా పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో అభిషేక్ ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దోమల బెడద నుంచి రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసిన మస్కిటో కాయిల్ కారణంగానే మంటలు చెలరేగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.