శ్రీశైలంలో విషాదం- సత్రంలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు - Suicide in Srisailam Satram - SUICIDE IN SRISAILAM SATRAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 8:39 PM IST

Young Man Committed Suicide in Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మఠంగారి మహేష్‌ ఆత్మహత్య (Suicide) చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సత్రం సిబ్బంది తలుపులు కొట్టగా అతను తీయకపోవడంతో వారు కిటికి నుంచి చూడగా మహేష్​ ఉరి వేసుకుని కనిపించాడు. గత కొంతకాలంగా మహేష్​ శ్రీశైలంలోని లింగాయత్ సత్రంలో నివాసం ఉంటూ, దేవస్థానం ఉపాలయమైన బయలు వీరభద్ర స్వామి ఆలయంలో ఉచిత సేవల కింద పని చేస్తున్నాడు. 

  మహేష్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మహేష్ ఆత్మహత్యపై  ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి  చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహేష్ కొంతకాలంగా శ్రీశైలం ఉపాలయాల్లోనే ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. అందరితో మర్యాదగా మెదిలే వాడని పేర్కొన్నారు. ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మహేష్ ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలుపై విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.