చేపల వివాదం - అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు - satya sai district death news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 5:27 PM IST

Young Brother Killed His Older Brother : చేపల కూర వండుకునే విషయంలో గొడవ పడి క్షణికావేశంలో అన్నను తమ్ముడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సంజీవప్ప, వెంకటేష్ అనే అన్నదమ్ములు తనకల్లు మండలం నడిమికుంటపల్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం చేపల కూర వండుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఆవేశానికి లోనైన తమ్ముడు వెంకటేష్​ అన్న సంజీవప్పపై దాడి చేశాడు.

Police Have Registered a Case : ఈ నేపథ్యంలోనే సంజీవప్ప తీవ్రంగా గాయపడ్డారు. అధికంగా రక్తస్రావం అవడం వల్ల అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పదునైన ఆయుధంతో దాడి చేయడం వల్లే తీవ్ర గాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంజీవప్ప మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తనకల్లు ఎస్సై రాజశేఖర్​ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.