ఎన్నికల వేళ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishnamurthy Joined TDP - MLC JANGA KRISHNAMURTHY JOINED TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 10:43 PM IST
YCP MLC Janga Krishnamurthy Joined TDP: రాష్ట్రంలో ఎన్నికల వేళ అధికార వైసీపీలో అలజడి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు ఎవరో ఒకరు రాజీనామా చేయడం లేదా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తున్నారు. ఇక కింది స్థాయిలో ఈ పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. రాజీనామా చేసిన నేతలు టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు.
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు కండువా కప్పి కృష్ణమూర్తిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను ఏ పదవినీ ఆశించి టీడీపీలో చేరలేదని తెలిపారు. వైసీపీలో గత కొంతకాలంగా అనేకమైన ఇబ్బందులు, అవమానాలకు గురవుతున్నట్లు తెలిపారు. ఇక వారి అవమానాలు తట్టుకోలేకే వైసీపీని వీడినట్లు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో ఇన్ని సంవత్సరాలు వైసీపీలో కొనసాగినట్లు తెలిపారు.