దళిత వృద్ధునిపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి - ఖండించిన దళిత సంఘాలు - YCP leader attack on Dalit man
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 11:05 PM IST
YCP MLA Abbayya Chowdary Followers Attacked on Old Dalit Man : పొలంలో చేతబడి చేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తావా అంటూ దళిత వృద్ధుడిపై దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి బంధువు దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. ఎమ్మెల్యే చిన్నాన్న కుమారుడైన భరత్ చౌదరి ఈ దాడి చేసినట్లు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పెదవేగి మండలం రాయన్నపాలెంలో వృద్ధుడైన దొండపాటి చంటి అనే వ్యక్తికి కొంత పొలం ఉంది. ఈ పొలంలో కోడి ఈకలు ఉన్నట్టు ఎమ్మెల్యే బంధువు భరత్ గుర్తించాడు. అనంతరం దొండపాటి చంటిని దూషిస్తూ, మమ్మల్ని చంపడానికి చేతబడులు చేస్తున్నావా అని కొట్టారు.
వృద్ధుడిపై దాడి చేసిన అనంతరం విషయం బయటకు రావడంతో దాడి చేసిన వారే వృద్ధుడికి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించి 24 గంటలు గడవకముందే అధికార పార్టీకి దళితులపై ఉన్న ప్రేమ బయట పడుతుందంటూ ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.