చీరెలు పంచుతామంటూ మండుటెండలో సభకు తరలింపు- మహిళలకు షాక్ ఇచ్చిన వైసీపీ నేతలు
🎬 Watch Now: Feature Video
YCP Leaders Was Violated The Election Code at Proddutur: వైఎస్సార్ జిల్లా పొద్దుటూరులో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల పేరుతో ఎర వేస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో నూర్ భాషా దూదేకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీరలు పంపిణీ చేస్తామని చెప్పి మహిళలను సభకు భారీ ఎత్తున తరలించారు. మహిళలకు చీరలకు సంబంధించిన టోకెన్లు పంపిణీ చేయడంతో ఎండలో గంటల తరబడి నిలబడి ఎదురు చూశారు. అయినా చీరలు ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరికి టోకెన్లు ఉన్న మహిళలకు ఇళ్ల వద్దకే చీరలు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. వైసీపీ నాయకుల తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దూరం తీసుకొచ్చి ఉత్త చేతులతో పంపిస్తారా అని మహిళలు మండిపడ్డారు. ఈ విషయంపై నగర కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రావడంతో రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే సమావేశాలకు ప్రస్తుతం అనుమతి అంశంపై సందిగ్ధత నెలకొనడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నగదు, తాయిలాల పంపిణీపై ఫిర్యాదులొస్తే చర్యలు చేపడతామని తెలిపారు.