వైఎస్సార్సీపీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు - పార్టీ వీడుతున్నట్లు నేతలు వెల్లడి - పార్టీని వీడుతున్న వైసీపీ నేతలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 10:24 AM IST
YSRCP Leaders Was Leaving The Party and Joining TDP: రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీపై అసంతృప్తితో కొందరు వైఎస్సార్సీపీ నేతలు తెలుగుదేశంలోకి చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెంది పార్టీ మారినట్లు నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆరిమిల్లి రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో పని చేసేందుకు గ్రామ స్థాయి నుంచి నాయకులంతా సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కూటమి గెలుపునకు తామంతా కృషి చేస్తామని నేతలు వెల్లడించారు. గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా చంద్రబాబు- పవన్‌తోనే సాధ్యమని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అధికార పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పితాని మోహన్, గోడవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు