రోడ్డు పనులు అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు - మండిపడిన గ్రామస్థులు - రోడ్డు మరమ్మతును అడ్డుకున్న వైసీపీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-02-2024/640-480-20860396-thumbnail-16x9-ycp-leader-stopped.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 1:13 PM IST
|Updated : Feb 28, 2024, 2:24 PM IST
YCP Leaders Stopped Road Repairs in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల గ్రామం రోడ్డు మరమ్మతులను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆత్మకూరు నుంచి కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల నుంచి పింజిరి కొట్టాల వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ విషయమై నుసికొట్టాల వాసులు ఇటీవల కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు స్పందించిన సురేంద్రబాబు జేసీబీలతో రోడ్డు పక్కన ముళ్లచెట్లు, గుంతల్లో మట్టివేసి బాగు చేస్తున్నారు.
ఈ విషయం తెలిసిన వైసీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులతో అక్కడికి వెళ్లి పనులు ఆపేందుకు ప్రయత్నించారు. అక్కడి గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకొని వైసీపీ నాయకులతో వాదనకు దిగారు. దీంతో వైసీపీ నాయకులు వెనుతిరిగారు. అనంతరం టీడీపీ నాయకులు అక్కడి చేరుకొని పనులు చేయిస్తున్నారు. ఎలాగైనా పనులను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు అధికారులను పురమాయించారు. అనుమతి లేకుండా రోడ్డు ఎలా వేస్తారని టీడీపీ నాయకులను అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని మీరు ఎలా చేస్తారంటూ పోలీసులు వారిని దబాయించారు.