వైఎస్సార్సీపీ నాయకుల దాష్టీకం-టీడీపీ నాయకుల కారుపై దాడి - YCP Leaders Attacked TDP Car - YCP LEADERS ATTACKED TDP CAR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 9:15 AM IST
YCP Leaders Attacked TDP Car in YSR District : టీడీపీ కార్యకర్తకు చెందిన కారుపై వైసీపీ నాయకులు దాడి చేసి, అద్దాలు పగులగొట్టారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కడప టీడీపీ అభ్యర్థి మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు చలమారెడ్డి పల్లెలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే హనుమంతు అనే టీడీపీ కార్యకర్త వాహనంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. చలమారెడ్డి పల్లెలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓ వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మరో వీధిలో నిలిపి ఉన్న హనుమంతు వాహనంపై దాడి చేశారు.
కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసి అక్కడి నుంచి వైసీపీ నాయకులు పరారయ్యారు. వెంటనే విషయం తెలుసుకున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని దాడిలో ధ్వంసం ఆయన కారును పరిశీలించారు. అనంతరం రిమ్స్ సమీపంలోని పోలీస్ స్టేషన్ వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.