వైఎస్సార్ జిల్లాలో దారుణం - యువకుడిని నిర్బంధించి దాడి చేసిన వైసీపీ నాయకులు - YCP leader attack
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 6:26 PM IST
YCP Leader Attack on Young Man in YSR District : వైఎస్సార్ జిల్లాలో సృజన్ కుమార్ అనే యువకుడుని వైసీపీ నాయకులు ఇంట్లో నిర్బంధించి కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఘటన చోటు చేసుకుంది. బాకీ డబ్బులు చెల్లించలేదని చర్చి నుంచి వస్తున్న తనను రోడ్డుపై నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి ఇంట్లో నిర్బంధించి కొట్టారని బాధితుడు ఆరోపించారు. అంతేగాక చంపుతామని బెదిరించారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిలో తెలుగుదేశం నేత నందం సుబ్బయ్య హత్య కేసు నిందితుడు బెనర్జీ, అతని కుటుంబ సభ్యులు ఉన్నారు.
విషయం తెలుసుకున్న సృజన్ కుమార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన బెనర్జీ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఎందుకు తమ కుమారుడిని నిర్భందించి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉందనే అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఘటనపై ప్రోద్దుటూరులోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెనర్జీ అతని కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.