వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొడతాం: బీటెక్ రవి - YCP 15 Minority Families Joined TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 9:58 AM IST
YCP 15 Minority Families Belonging to Joined TDP: తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల గురించి వైసీపీ మీడియా దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్‌ను ఓడించి టీడీపీ జెండా ఎగరేస్తామని రవి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం పామలూరులో వైసీపీకు చెందిన 15 మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వివేకా హత్య కేసులో నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన చెల్లెల్లు షర్మిల, సునీత చెబుతున్నారంటే పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసునని పేర్కొన్నారు.
చిత్రావతి ప్రాజెక్టులో కావల్సినంత నీరు ఉన్నా ఆయకట్టుకు చివరి ప్రాంతమైన వేంపల్లెకు మాత్రం చుక్క నీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అంతకుముందు చక్రాయపేట మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ వాడవాడలా బలోపేతనం అయ్యిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీ.జీ భరత్ అన్నారు. పట్టణంలోని పలు వార్డులకు చెందిన యువకులు తెలుగుదేశంలో చేరారు. వారికి కండవా వేసి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.