యాదాద్రి చేరుకున్న లక్ష్మీనరసింహ స్వామి అఖండ జ్యోతి పాదయాత్ర - Yadadri Varshika Bramhotsavam 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 12, 2024, 12:45 PM IST
Yadadri Varshika Bramhotsavam 2024 : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి అఖండ జ్యోతి పాదయాత్ర యాదాద్రికి చేరుకుంది. ఇది లక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి పాదయాత్ర. హైదరాబాద్‌లోని బర్కత్ పుర యాదగిరి భవన్‌లో 4 రోజుల క్రితం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అఖండ జ్యోతి యాత్ర, ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి మీదుగా కొనసాగింది.
Yadadri Akhanda Jyoti 2024 : యాదాద్రికి చేరుకున్న అఖండ జ్యోతికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ రామకృష్ణారావు ఈ పూజలో పాల్గొన్నారు. ంవాహనంలో కొలువు దీరిన స్వామి వారిని దారి పొడవునా భక్తులు దర్శించుకున్నారు. మహిళలు వీధుల వెంట స్వామి వారికి యాత్రకు స్వాగతం పలుకుతూ మంగళ హారతులిచ్చారు. కోలాట బృందం స్వామివారి యాత్ర ముందు ప్రదర్శన చేశారు. యాదాద్రి అర్చక బృందం జ్యోతి యాత్ర రథంలో కొలువు దీరిన లక్ష్మీనరసింహుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలను నివేదన జరిపి భక్తులకు వితరణ చేశారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతినియాత్ర వైకుంఠ ద్వారం చెంతకు చేర్చారు.