శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు - CWC VISIT SRISAILAM DAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2024, 4:48 PM IST
World Bank Representatives To Visit Srisailam Dam : శ్రీశైలం జలాశయాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం, సీడబ్ల్యూసీ అధికారులు పరిశీలించారు. ఆనకట్ట డౌన్ స్ట్రీమ్ ఎఫ్రాన్ను పరిశీలించారు. 2009 వరదల సందర్భంగా కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డును కూడా పరిశీలించారు. శ్రీశైలం ఆనకట్ట మరమ్మతులు నిర్వహణకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వ డ్రిప్ పథకం కింద మంజూరు చేయడానికి సన్నాహాలు చేపట్టారు.
డ్రిప్పు పథకం కింద రూ.210 కోట్లు రెండు విడుతల్లో పనులు చేయనున్నట్లు శ్రీశైలం ఆనకట్ట ముఖ్య ఇంజినీరు కబీర్ భాషా తెలిపారు. తొలి విడతగా రూ .103 కోట్లతో పనులు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. శ్రీశైలం ఆనకట్ట యాప్రాన్ సిలిండర్ల బలోపేతం, అప్రోచ్డ్ రోడ్డు నిర్మాణం, కొండ చర్యలు పడకుండా నిర్మాణ పనులు చేయడానికి త్వరలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లతో చర్చించి టెండర్లు పిలవనున్నట్లు కబీర్ భాష తెలిపారు.