కనిగిరి మహిళలు నిరసన-నీరు అడిగితే పార్టీ రంగులు పులుముతున్నారు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 12:03 PM IST
Women Protest Water Problem in Prakasam District : తాగు నీటి కోసం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో మహిళలు నిరసన చేపట్టారు. శంఖవరంలో ఎస్సీ కాలనీలో రెండు నెలలుగా నీరందించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు ఇవ్వడానికి కూడా పార్టీ రంగు పులుముతూ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ సానుభూతిపరులకు నీళ్లిచ్చేది లేదంటూ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి కుళాయిలకు వస్తున్నా నీటిని కూడా ఆపివేసి పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎన్సీ కాలనీ వాసులు ఆందోళన చేశారు.
గుక్కెడు నీటినైనా అందించు మహాప్రభు అంటూ వైసీపీ నాయకులను వేడుకుంటున్న కనికరించలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులకు వెళ్లకుండా సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరా? అని మహిళలు ప్రశ్నించారు.