నందిగాం సురేష్‌కు అవమానం- 'మాకు వద్దు' అంటూ మహిళలు నినాదాలు - nandigam suresh election campaign - NANDIGAM SURESH ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 5:21 PM IST
Women Protest Against Nandigam Suresh Election Campaign: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరప్పాడులో వైఎస్సార్సీపీ వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్, అద్దంకి వైఎస్సార్సీపీ అభ్యర్థి (Hanimi Reddy) హనిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఓ వర్గం మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థి మాకు వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దలు కలుగజేసుకొని సముదాయించినా మహిళలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
Women Warned To YSRCP Leaders: రానున్న ఎన్నికల్లో తాము వైఎస్సార్సీపీకి ఓటు వేయబోమని మహిళలు స్పష్టం చేశారు. అంతకుముందు వైఎస్సార్సీపీ టోపీలు, కండువాలతో ఆలయంలోకి వెళ్లి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. అదే విధంగా చర్చిలో కూడా వైఎస్సార్సీపీ జెండాలతో పార్టీ నేతలు దర్శనమిచ్చారు. రాత్రి సమయాల్లో జరిగే వైఎస్సార్సీపీ (YSRCP) ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఈ విధానం పరిపాటిగా మారిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.