Sexual Assault Case On YCP Former Minister Kakani Follower : మాజీ మంత్రి, వైఎస్సార్సీసీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనుచరుడు మందల వెంకట శేషయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త చనిపోయిన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ వెంకటాచలం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తెల్లకాగితంపై సంతకం చేయించుకుని నిత్యం బెదిరించేవాడని, రోజూ ఫోన్ చేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతడి వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు శేషయ్యను అరెస్టు చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళపై లైంగిక దాడి - మాజీమంత్రి కాకాణి అనుచరుడు అరెస్ట్ - SEXUAL ASSAULT CASE ON YCP LEADER
మాజీమంత్రి కాకాణి అనుచరుడు మందల వెంకటశేషయ్యపై కేసు - ప్రతిరోజూ ఫోన్ చేసి కోరిక తీర్చాలంటూ వేధింపులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2024, 10:54 PM IST