జగన్​ సభా సంప్రదాయాల గురించి మాట్లాడటం విడ్డూరం: మంత్రి సంధ్యారాణి - Sandhya Rani Comments on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 4:46 PM IST

thumbnail
జగన్​ సభా సంప్రదాయాల గురించి మాట్లాడటం విడ్డూరం: మంత్రి సంధ్యారాణి (ETV Bharat)

Women & Tribal Welfare Minister  Gummadi Sandhya Rani Comments on Jagan : కనీస గౌరవ, మర్యాదలు లేని జగన్​  సభా సంప్రదాయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడ్ని స్పీకర్​ స్థానంలో కూర్చోబెట్టే విషయంలో జగన్ హుందాగా వ్యవహరించ లేదని మండిపడ్డారు. మంత్రి హోదాలో తొలిసారి ఆమె పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం కార్యాలయానికి వచ్చారు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్​ (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లా విషయంలో ప్రతిపక్షం ఎంతో హుందాగా, గౌరవ మర్యాద పాటించింది. రాష్ట్ర శాసనసభలో మాత్రం, కనీసం సభా సంప్రదాయాలను జగన్ పాటించలేదని అన్నారు. సొంత పార్టీ నాయకులనే నమ్మని జగన్, ఇతరులను ఎలా గౌరవిస్తారని మంత్రి పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.