సబ్బుపై కాలు వేసి భవనంపై నుంచి జారిపడ్డ మహిళ- కాపాడేందుకు భర్త ప్రయత్నించినా! - Woman Fell From Building

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 12:55 PM IST

Updated : Jun 22, 2024, 2:28 PM IST

thumbnail
సబ్బుపై కాలు వేసి భవనంపై నుంచి జారిపడ్డ మహిళ (ETV Bharat)

Woman Fell From Building in Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళ ప్రమాదవశాత్తు సబ్బుపై కాలు వేసి భవనంపై నుంచి కిందపడింది. మహిళను రక్షించేందుకు భర్త ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భవనం పైనుంచి కిందపడడం వల్ల మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.  

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, డీజే హళ్లి పోలీస్​ స్టేషన్ పరిధిలోని కనకనగర్​కు చెందిన రుబాయి(27) తన భర్తతో కలిసి నివాసముంటుంది. మూడు రోజుల క్రితం భర్తతో కలిసి భవనంపై నిల్చున్న రుబాయి, ప్రమాదవశాత్తు సబ్బుపై కాలు వేసి కిందకు జారి పడిపోయింది. ప్రమాద సమయంలో పక్కనే భర్త కాపాడేందుకు రుబాయి చేతిని పట్టుకున్నా, జారి కింద పడిపోయింది. దీంతో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం రుబాయి విక్టోరియా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతుంది.  

మహిళపై తీవ్రంగా దాడి చేసిన గేదె
ఇటీవల తమిళనాడులోని ఓ మహిళపై గేదె తీవ్రంగా దాడి చేసింది. కొమ్ములతో రోడ్డుపై ఈడ్చుకుని వెళ్లింది. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. పూర్తి కథనం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Jun 22, 2024, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.