ETV Bharat / sports

టీమ్ఇండియా అమ్మాయిలు భళా- టెస్టు హిస్టరీలో హైయ్యెస్ట్​ స్కోర్ - Ind W vs Sa W Test 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 1:33 PM IST

Updated : Jun 29, 2024, 4:31 PM IST

Ind W vs Sa W Test 2024: చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో మహిళల టీమ్ఇండియా రికార్డు నెలకొల్పింది. సింగిల్ ఇన్నింగ్స్​లో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ​

Ind vs Sa Test
Ind vs Sa Test (Source: Getty Images)

Ind W vs Sa W Test 2024: భారత మహిళల జట్టు టెస్టు క్రికెట్​లో చరిత్ర సృష్టించింది. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో టీమ్ఇండియా 603-6 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్డ్ చేసింది. దీంతో టెస్టు ఫార్మాట్​ చరిత్రలో సింగింల్​ ఇన్నింగ్స్​లో అత్యధిక పరుగులు బాదిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఆస్ట్రేలియా 575-9 పేరిట ఈ రికార్డు ఉంది. తాజా ఇన్నింగ్స్​తో టీమ్ఇండియా మహిళలు ఈ రికార్డును బద్దలుకొట్టారు.

మహిళల టెస్టు క్రికెట్​లో టాప్- 5 స్కోర్లు

  • భారత్- 603/6d vs సౌతాఫ్రికా- 2024
  • ఆస్ట్రేలియా- 575/9d vs సౌతాఫ్రికా- 2024
  • ఆస్ట్రేలియా- 569/6d vs ఇంగ్లాండ్- 1998
  • ఆస్ట్రేలియా- 525/10 vs భారత్- 1984
  • న్యూజిలాండ్- 517/8 vs ఇంగ్లాండ్- 1996

ఇక ఓవర్​నైట్ స్కోర్ 525-4తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 78 పరుగులు జోడించింది. ఈ సెషన్​లో రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ (69 పరుగులు), రిచా ఘోష్ (86 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ 5వ వికెట్​కు 143 పరుగులు భాగస్వామ్యం నిర్మించారు. సౌతాఫ్రికౌ బౌలర్లలో దెల్మి టక్కర్ 2, డి క్లర్క్, సెకుదునే, మల్బ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు తొలి రోజు కూడా మ్యాచ్​లో టీమ్ఇండియా అమ్మాయిలదే పూర్తి ఆధిపత్యం సాగింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (205 పరుగులు) డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, స్మృతి మంధాన (149 పరుగులు) భారీ సెంచరీతో రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే షఫలీ మహిళల టెస్టు క్రికెట్​లోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్​గా రికార్డు కొట్టింది. 194 బంతుల్లోనే షఫాలీ 200 పరుగుల మార్క్ అందుకుంది. దీంతో ఆసీస్ బ్యాటర్​ అనబెల్ (248 బంతుల్లో) రికార్డ్​ను షఫాలీ బ్రేక్ చేసింది. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్​కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల టెస్టుల్లో తొలి వికెట్​కు ఇదే అత్యధికం. జెమిమా రోడ్రిగ్స్ (55 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించింది.

షఫాలీ వర్మ @200- దెబ్బకు వరల్డ్​ రికార్డ్ బ్రేక్ - Ind w vs Sa w Test 2024

టాప్​లో స్మృతి, హర్మన్​... కాంట్రాక్ట్​ లిస్ట్​లో తెలుగు అమ్మాయిలకు చోటు

Last Updated : Jun 29, 2024, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.