ETV Bharat / health

చక్కటి పరిష్కారం : మీ ముఖం వెంటనే జిడ్డుగా తయారవుతోందా? - ఈ ఫేస్​ప్యాక్స్​తో తాజాగా మారిపోతుంది! - Home Remedies for Oily Skin - HOME REMEDIES FOR OILY SKIN

Home Remedies for Oily Skin : కొంతమంది చర్మం ఏ కాలంలోనైనా జిడ్డుగానే కనిపిస్తుంటుంది. ఇక నల్ల మచ్చల గురించి చెప్పక్కర్లేదు. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే.. కొన్ని ఫేస్​ప్యాక్స్ ట్రై చేస్తే సమస్య ఇట్టే తీరుపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Home Remedies for Oily Skin
Home Remedies for Oily Skin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 1:09 PM IST

Home Remedies for Oily Skin and Black Spots: అందంగా మెరిసే ముఖంపై చిన్న మొటిమ వచ్చినా, నల్లమచ్చలు ఏర్పడినా అమ్మాయిలు తట్టుకోలేరు. అలాంటిది.. కొద్దిమందిలో కాలంతో సంబంధం లేకుండా చర్మం జిడ్డుగా కనిపిస్తుంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇంట్లోనే లభించే పదార్థాలతో ఫేస్​ప్యాక్స్ వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ముఖం కాంతివంతంగా మారుతుందని సూచిస్తున్నారు. ఆ ఫేస్​ప్యాక్​లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

జిడ్డుదనం పోగొట్టుకోవడానికి:

  • అర టేబుల్‌స్పూన్‌ చొప్పున చందనం, ముల్తానీ మట్టి తీసుకొని.. ఈ రెండింటినీ రోజ్‌వాటర్‌లో కలుపుకుంటూ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.
  • ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డుదనం తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.
  • 2016లో "జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 4 వారాల పాటు ముల్తానీ మట్టి, చందనం ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించిన తర్వాత ముఖంపై నూనె ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు.

30 ఏళ్లకే నుదుటిపై గీతలు.. ముఖం మీద ముడతలా? - ఇలా చేస్తే 60 ఏళ్ల దాకా చర్మం ఫిట్​! - Best Tips For Skin

బంతిపువ్వు ఫేస్​ ప్యాక్​:

  • మెత్తగా చేసిన బంతి పూవు రెేకులు - అర చెంచా
  • ఉసిరి పొడి - అర చెంచా
  • పెరుగు - అర చెంచా
  • నిమ్మరసం - ఆరు చుక్కలు

ఇలా చేయండి:

  • ముందుగా ఉసిరి పొడిని తీసుకుని మెత్తగా చేసి పెట్టుకున్న బంతి పూవు రెక్కలకు కలుపుకోవాలి.
  • తర్వాత ఐదు చుక్కల నిమ్మరసం కూడా ఈ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అరచెంచా పెరుగును కూడా కలుపుకోవాలి.
  • పెదాలను, కళ్ల కింద భాగాన్ని వదిలేసి ముఖమంతా ఈ పేస్టును రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత కడిగేసుకుంటే ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది.

డైలీ ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేశారంటే- మేకప్‌ లేకుండానే మెరిసిపోవచ్చు! - natural face mask for glowing skin

నల్లమచ్చలు తొలిగించుకునేందుకు:

  • మంచి నాణ్యమైన తేనె తీసుకోవాలి. దీన్ని నల్ల మచ్చలున్న చోట నేరుగా అప్లై చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత క్లీన్​ చేసుకోవాలి.
  • ఇలా రోజూ క్రమం తప్పకుండా తేనె అప్లై చేయడం వల్ల ఆ నల్ల రంగు మచ్చలు తేనె రంగులోకి మారి.. క్రమక్రమంగా చర్మ రంగులో కలిసిపోతాయంటున్నారు.
  • అయితే ఈ మచ్చలు అంత త్వరగా తగ్గవు కాబట్టి.. ఓపిగ్గా నెల రోజులపాటు క్రమం తప్పకుండా ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు.
  • 2016లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 8 వారాల పాటు క్రమం తప్పకుండా నల్లమచ్చలపై తేనె పూయడం వల్ల వాటి రంగు, తీవత్ర తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో సుడాన్​లోని యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫార్మసీలో డెర్మటాలజిస్ట్ డాక్టర్ అబ్దుల్‌రహీం బదరాల్దిన్ పాల్గొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ ఆయిల్స్​ ట్రై చేసే మెరుపు గ్యారంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.