వాటర్ హీటర్ స్వీచ్ వేస్తుండగా కరెంటు షాక్- మహిళ మృతి - ఓబులాపురంలో మహిళ మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 11:41 AM IST
Woman Dies Due to Electric Shock in Obulapuram: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఓబులాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ షాక్ కొట్టి సునీత (28)అనే వివాహిత మృతి చెందినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే నాగార్జున, సునీత దంపతులు. వీరు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సునీత స్నానం చేయడానికి వెళ్లి స్విచ్ వేస్తుండగా కరెెంటు షాక్ తగిలి కిందపడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయంపై కసాపురం ఎస్ఐ దుగ్గిరెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.