హైదరాబాద్లో బస్సు ఢీకొని యువతి మృతి - సీసీటీవీలో దృశ్యాలు - Hyderabad Bus Accident CCTV Visuals - HYDERABAD BUS ACCIDENT CCTV VISUALS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 8:56 PM IST
Woman Died After Being Hit By Electric Bus : హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి కొత్తగుడా చౌరస్తా నుంచి మాదాపూర్ వైపు నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న కలువ మాధవి (25) అనే యువతిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వెనుక నుంచి వేగంగా వచ్చి బస్సు ఢీ కొట్టడంతో, చక్రాల కింద పడి యువతి తీవ్రంగా గాయపడింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ప్రమాదం జరిగిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accidents In Telugu States : ఇటీవల కాలంలో తెలుగు రాష్టాల్లో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో పాటు, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడంతో అనేక మంది ప్రమాదాల భారిన పడుతున్నారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు అంటున్నారు.