కాసేపట్లో రెండో పెళ్లి - మొదటి భార్య రాకతో భర్త పరార్ - Second Marriage Stop in Tirumala - SECOND MARRIAGE STOP IN TIRUMALA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2024/640-480-22163915-1093-22163915-1723190612356.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 1:38 PM IST
Wife Stop Husbands Second Marriage in Tirumala : తిరుమలలో రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. మొదటి భార్య ఉండగా హైదరాబాద్‌కు చెందిన రాకేశ్ అనే వ్యక్తి తిరుమలలోని ఓ మఠంలో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆ సమాచారం తెలుసుకున్న మొదటి భార్య సంధ్య తిరుమలకు చేరుకున్నారు. సంధ్యను చూసిన వరుడు రాకేశ్ కల్యాణ మండపం నుంచి పరారయ్యాడు. అనంతరం అక్కడ కొంతమందిని సంధ్య కుటుంబసభ్యులు పట్టుకుని తిరుమల పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
రాకేశ్ తనకు తెలియకుండా తిరుమలలో రెండో వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం అందిందని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పెద్ద పెండ్యాలకు చెందిన సంధ్య తెలిపారు. రాకేశ్‌తో విడాకుల విషయంపై న్యాయస్థానంలో ఇంకా కేసు నడుస్తోందని అయినప్పటికీ ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఆమె ఆరోపించింది. ఈ విషయం తెలుసుకుని తిరుమల వచ్చి వివాహం జరగకుండా ఆపేశానన్నారు. తనతో పాటు తన కుమార్తెకు పోలీసులు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.