ట్యాంకర్ వస్తేనే నీళ్లు- ఎదురు చూస్తూ కనిగిరి వాసుల కన్నీళ్లు - Water Problems in Prakasam
🎬 Watch Now: Feature Video
Water Problems in Prakasam District : ప్రకాశం జిల్లా కనిగిరిలో కనీసం చుక్క నీరు అందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు15 రోజులకోసారి అరకొరగా నీటిని అందిస్తున్నారు. దీంతో నీళ్లు ఏమాత్రం సరిపోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు సమస్య గురించి చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయోనని పనులు మానుకొని ఎదురు చూస్తున్నామని వాపోయారు.
Water Scarcity in Kanigiri : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన గుక్కెడు నీటి కోసం రోడ్ల వెంబడి ట్యాంకర్ల కోసం ఎదురు చూసినా కన్నీళ్లే మిగులుతున్నాయి తప్ప చుక్క నీరు అందని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఇచ్చే కొద్ది గొప్ప నీటి కోసం ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయోనని పనులు మానుకొని రోడ్ల వెంబడి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పట్టణ వాసులు ఆవేదన చెందుతున్నారు.