యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఓట్ ఫర్ ఓపీఎస్ సదస్సు - 'సీపీఎస్ రద్దు చేసే పార్టీకే ఓటు' - AP Latest News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-01-2024/640-480-20611758-thumbnail-16x9-ops-state-level-conference.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 7:11 PM IST
Vote for OPS State Level Conference Under UTF: రాజమహేంద్రవరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో వోట్ ఫర్ ఓపీఎస్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన ఉపాధ్యాయులు సీపీఎస్ రద్దు (Abolition of CPS in AP) చేయాలని కోరారు. సీపీఎస్ రద్దును మేనిఫెస్టోలో పెట్టే పార్టీలకే ఉద్యోగ ఉపాధ్యాయులు ఓటు వేస్తామని తెలిపారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచడం అప్రజాస్వామికం అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐవీరావు అన్నారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు సీపీస్‌ను, జీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానం పునరుద్ధరణ చేస్తామని అన్నారు. చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు కోరారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చాలని ఉద్యమం చేపట్టారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు.