'మాతో బలవంతంగా రాజీనామా చేయించారు- వైఎస్సార్సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి' - Volunteers Dharna in Kakinada - VOLUNTEERS DHARNA IN KAKINADA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 5:31 PM IST
Volunteers Dharna in Kakinada : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పార్టీకి రెండు కళ్లలా వాలంటీర్లు క్రియాశీలకంగా పని చేశారు. అలాంటి వాలంటీర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో విధులకు దూరం పెట్టడంతో స్థానిక పార్టీ నాయకుల మాటలు నమ్మి వారు రోడ్డున పడ్డారు. వాళ్ల భవిష్యత్తు ఏంటో తెలియక ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనలకు దిగుతున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాకినాడ సిటీకి సంబంధించిన వందలాది మంది వాలంటీర్లు తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ ధర్నా చేపట్టారు.
గత వైఎస్సార్సీపీ నాయకులు మమ్మల్ని బెదిరించి, బలవంతంగా మా చేత రాజీనామాలు చేయించారని తెలిపారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, జగన్ ప్రభుత్వం ఏర్పడి తిరిగి మిమ్మల్ని విధుల్లోకి తీసుకునేంతవరకు ప్రతీ నెల జీతాలు చెల్లిస్తామని మాటిచ్చారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పట్లేదని రెండు నెలల జీతాలు చెల్లించలేదని వాపోయారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.