వైసీపీకి ప్రచారం చేస్తున్న వాలంటీర్ - వైరల్ అవుతున్న వీడియో - Volunteer Campaigning
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 5:03 PM IST
Volunteer Campaigning for YSRCP: వైసీపీ ప్రభుత్వ పాలనపై వాలంటీర్లు ప్రచారకర్తలుగా మారారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఈదుమూడిలో ఓ వాలంటీర్ ఇంటింటికీ వెళ్లి జగన్‌కు ఓటెయ్యాలని ప్రలోభపెట్టాడు. దాన్ని వీడియోగా తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. పింఛన్లు జగన్ ఇస్తున్నారని, మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరాడు. జగన్‌ను గెలిపించాలంటూ వృద్ధులకు వాలంటీర్ పాఠాలు వల్లెవేశాడు. సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్, మంత్రి మేరుగ నాగార్జునను ప్రసన్నం చేసుకోడానికే వాలంటీర్లు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ వాలంటీర్ల సైతం పలుమార్లు అడ్డంగా దొరికిపోయారు. అంతే కాకుండా వాలంటీర్లను ఎన్నికల్లో ప్రచారానికి వాడుకునేందుకు పలువురు నేతలు తాయిలాలు కూడా ఇచ్చారు. వాలంటీర్ల తమ వారంటూ సీఎం జగన్, వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించుకున్నారు. తాజాగా జగన్‌కే ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న వాలంటీర్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.