మాటలకే పరిమితమైన జగన్ హామీలు- ఐదేళ్లపాలనపై పెదవి విరుస్తున్న అన్నదాతలు - Vizianagaram Farmers Interview - VIZIANAGARAM FARMERS INTERVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 3:41 PM IST
Vizianagaram Farmers Interview: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని జగన్, వైఎస్సార్సీపీ నేతలు ఊదరగొడుతూ ఉంటారు. రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు, టార్పాలిన్లు, రాయితీపై ఎరువులు, పురుగుమందులు, ఉద్యాన రైతులకు స్పేయర్లు, ఇతర పరికరాలు అందిస్తామని చెప్పారు. అయితే అవి మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయని అన్నదాతలు వాపోతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశారని మండిపడుతున్నారు.
రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. రబీ, ఖరీఫ్ పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. సున్నా వడ్డీ రుణాలు మంజూరు, పంటకు ఉచిత బీమా, సకాలంలో పంటకు పరిహారం అందిస్తామని ఇలా జగన్ అనేక హామీలు ఇచ్చి తమను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందంటున్న విజయనగరం రైతులతో మా ప్రతినిధి ఓబిలేసు ముఖాముఖి.