'వైఎస్సార్సీపీ వివక్షపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు - కూటమి రాకతోనే సమస్యలకు పరిష్కారం' - Visakha West MLA Ganababu - VISAKHA WEST MLA GANABABU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 12:29 PM IST
TDP MLA Candidate Ganababu interview : సింహాచలం భూములు, టిడ్కో గృహాలను అందించకుండా పేదలను మోసం చేసిన వైఎస్సార్సీపీ తీరుపై విశాఖ పశ్చిమ ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థి గణబాబు పేర్కొన్నారు. ఎన్డీఏ (NDA) కూటమి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో నాలుగోసారీ ఎమ్మెల్యే (MLA)గా గెలుస్తానని గణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఉన్న విశాఖలో వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో శాంతి భద్రతలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలను తరిమికొట్టారని తెలిపారు. చంద్రబాబు హయాంలో సుదీర్ఘ సమస్యలు పరిష్కరించాం. డిఫెన్స్ రోడ్లు, నగరానికి చేరుకునే అంతర్గత రోడ్లను తీర్చిదిద్దాం. రైల్ గేటు సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాం. షిప్‌యార్డ్ నుంచి రోడ్డు విస్తరణతో పాటు తీర్చిదిద్దాం. ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు ఇచ్చాం. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆమోదించలేదు. విశాఖ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.