సమ్మె నిర్ణయం విరమించుకోండి - కార్మికుల డిమాండ్లపై విశాఖ ఉక్కు యాజమాన్యం స్పందన - Visakha steel Factory

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 2:05 PM IST

Visakha steel industry management responded : విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం స్పందించింది. పరిష్కారానికి వీలైన డిమాండ్లను ప్రకటించింది. పరిష్కరించలేని డిమాండ్లపైనా స్పష్టత ఇచ్చింది. కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని సూచిస్తూ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఎన్ జె సీ ఎస్ ఒప్పందం ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేసేందుకు సిద్దమమేనని ప్రకటించిన యాజమాన్యం సంఘాలతో సంప్రదింపుల అనంతరం అమలు చేస్తామని తెలిపింది.    

విశాఖ ఉక్కు లో సమ్మెకు వెళ్లవద్దని తొమ్మిది కార్మిక సంఘాలకు పరిశ్రమ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఎన్ జె సీ ఎస్ ఒప్పందం ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేసేందుకు సిద్దమమేనని వివరించింది. కానీ ఎప్పటినుంచి అమలుచేయాలన్నది కార్మిక సంఘాలతో సంప్రదింపుల అనంతరం పరస్పరం అంగీకారంతో మాత్రమే సాధ్యమని స్పష్టం చేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖనుంచి అనుమతి కూడా తీసుకున్న తర్వాత ఈ వేతన సవరణ అమలు సాధ్యపడుందని తేల్చి చెప్పింది. మిగిలిన డిమాండ్లు యాజమాన్య పరిధిలో లేదని కూడా యాజమాన్యం తేల్చింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.