వైభవంగా సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం - వేణుగోపాలుడి అలంకరణలో దర్శనం - Visakha Simhadri Appanna
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2024/640-480-20714816-thumbnail-16x9-visakha-simhadri-appanna-theppotsavam.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 10:58 AM IST
Visakha Simhadri Appanna Theppotsavam: విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. వరాహ పుష్కరిణిలో జరిగే నౌక విహారోత్సవానికి సింహాద్రి అప్పన్న స్వామి సింహగిరిపై నుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకువచ్చారు. స్వామివారు వేణుగోపాలుడి అలంకరణలో ఉభయ దేవేరులతో కలిసి మూడుసార్లు పుష్కరిణిలో విహరించారు. స్వామి, అమ్మవార్లను మండపంలో ఆశీనులను చేసి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తిరువీధిలో వేడుకలను జరిపారు.
Simhadri Appanna is in Decoration of Venugopal Swamy: సింహాద్రి అప్పన్న తెప్పోత్సవాలు పురస్కరించుకుని వరాహ పుష్కరణి చుట్టూ విద్యుత్ దీపాలతో ఆలయ అధికారలు అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పుష్కరిణి ప్రాంగణంలో పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తెప్పోత్సవం అనంతరం స్వామివారు సింహగిరికి చేరుకున్నారు. ఉత్సవాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏసీపీ అన్నపు నరసింహ మూర్తి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పన్న తెప్పోత్సవ ఉత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరిపై స్వామి వారి దర్శనాలు సాయంత్రం 6 గంటల నుంచి అధికారులు నిలిపేశారు.