'శారదా పీఠానికి కేటాయించిన కొండ అనుమతులు రద్దు చేయాలి' - హిందూ ధార్మిక సంస్థల డిమాండ్ - SARADA PEETHAM land - SARADA PEETHAM LAND
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 4:35 PM IST
Visakha Sarada Peetham Hill Permit Should be Cancelled : విశాఖ జిల్లా భీమిలిలో విశాఖ శారద పీఠానికి కేటాయించిన కొండ అనుమతులను వెంటనే రద్దు చేయాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేశాయి. కొత్తవలసలోని 15 ఎకరాలకుపైగా ఉన్న కొండను శ్రీనివాసానంద సరస్వతి నేతృత్వంలో స్వామీజీలు, హిందూ సంస్థల ప్రతినిధులు పరిశీలించారు. స్వామీజీలతో పాటు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కొండను పరిశీలించారు. వాణిజ్య అవసరాలకు భూమి ఇవ్వాలని శారదాపీఠం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గతంలో కోరింది. వాణిజ్య ప్రయోజనాలకు కొండను కేటాయించడాన్ని హిందూ ధార్మిక సంస్థలు వ్యతిరేకించాయి.
పూర్తిగా వ్యాపార ధోరణితో ఇది జరగడం, కొండ వినియోగానికి అనుమతించడం దారుణమని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. చారిత్రక ఆనవాలుగా ఉండే కొండను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయాలని ధార్మిక సంస్థలు డిమాండ్ చేశాయి. వేదపాఠశాల పెడతామని చెప్పి భూమి కేటాయించుకోగా స్థిరాస్తి వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయడం హేయమని మూర్తి యాదవ్ అన్నారు. శారదా పీఠానికి 2019కి ముందున్న ఆస్తులు ఎంత? ఇప్పుడు బినామీలకు ఉన్న ఆస్తులెంత? అనే లెక్కలు తేల్చాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.