మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక - Meteorological Officer on Rains
🎬 Watch Now: Feature Video
Visakha Meteorological Officer on Heavy Rains in AP: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది వాయవ్యంగా ప్రయాణించి రేపు ఉదయం ఒడిశాలోని పూరీ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం పూరీకి తూర్పు ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, కళింగ పట్నానికి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ చెప్తోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై వరద నీరు చేరిపోవటంతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు నానావస్థలు పడుతున్నారు. రాగల 24 గంటలు తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న విశాఖ వాతావరణ శాఖాధికారి కే.వీ.ఎస్ శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి మీకోసం.