కరెంట్ షాక్​తో సచివాలయ ఉద్యోగి మృతి- ఫ్లెక్సీలను తొలగిస్తుండగా ఘటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 10:00 AM IST

thumbnail

Village Ward Secretary Employee Died due to Electric Shock: ఎన్నికల కోడ్(Election Code) నేపథ్యంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో ఓ సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దేవరాపల్లి మండలం ములకలపల్లిలో పలు రాజకీయ పార్టీల బ్యానర్లను తొలగిస్తుండగా కొత్తపెంట సచివాలయానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ చిరంజీవి(Village Ward Secretary Welfare Assistant Chiranjeevi Death Case) కి విద్యుత్ తీగలు(Electrical Wires) తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

విజయనగరం జిల్లా కొంపల్లి గ్రామానికి చెందిన మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిరంజీవి మృతితో వారి కుటుంబంతో పాటు ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు(Deputy CM Budi Mutyala Naidu) మృతుడు చిరంజీవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.