బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విజయవాడ వ్యక్తి మరొకరు- రిమాండ్లో నిందితులు - RAVE PARTY CASE - RAVE PARTY CASE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 11:24 AM IST
Vijayawada Person Arrested in Bangalore rave party case : ప్రస్తుతం బెంగళూర్ రేవ్ పార్టీ వ్యవహారం ట్రెండింగ్ అంశం అయ్యింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న వారిలో విజయవాడకు చెందిన వ్యక్తి ఉన్నట్లు వెల్లడైంది. ఎఫ్‌ఐఆర్ (FIR) బయటకు రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఈ పార్టీలో పాల్గొని అరెస్టు అయిన నగరవాసుల సంఖ్య రెండుకు చేరింది.
విజయవాడ వన్ టౌన్ ప్రాంతానికి చెందిన డి.నాగబాబును బెంగళూరు పోలీసులు ఏ3గా ఎఫ్‌ఐఆర్(FIR) లో పేర్కొన్నారు. ఈ వేడుకను నిర్వహించిన విజయవాడకు చెందిన బుకీ వాసును ఏ1గా చేర్చారు. తన జన్మదినం సందర్భంగా బెంగళూరు శివారులోని ఓ పామ్ హౌస్ లో వాసు భారీ ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించాడు. దీనికి నాగబాబును కూడా ఆహ్వానించాడు. చివరకు నాగబాబు పార్టీకి వెళ్లి అక్కడ పోలీసులకు దొరికాడు. వీరిద్దరి మధ్య బంధం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.