క్రీడాకారులకు ఎన్నికల తాయిలాలు - క్రికెట్​ కిట్లు పంపిణీ చేసిన విజయసాయి రెడ్డి - Vijayasai Reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:10 PM IST

Vijayasai Reddy Distributing Election Gifts to Sportspersons : ఎన్నికల వేళ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా అధికార పార్టీ ప్రలోభాలకు తెర తీస్తోంది. ఇంత వరకు వాలంటీర్లు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలను పంపిణీ చేశారు. తాజాగా నెల్లూరు జిల్లాలో క్రీడాకారులకు క్రికెట్​ కిట్స్​ పంపిణీ చేసేందుకు వైసీపీ పార్లమెంట్​ వైసీపీ ఇన్​ఛార్జ్​ విజయసాయి రెడ్డి శ్రీకారం చుట్టారు. 

ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాలను ప్రొత్సహించడానికి 'ఆడుదాం ఆంధ్ర'ను ప్రభుత్వం నిర్వహించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో క్రికెట్​కు మంచి ఆదరణ ఉందని, గుర్తింపు పొందిన వారు నేడు రాజకీయాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాలను అభివృద్ధి చేయడానికి వైసీపీ అభివృద్ధి చేయడానికి ఎంతోగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్​ మండలంలోని మొగళ్లపాలెంలో క్రీడా కాంప్లెక్స్​ కోసం సేకరించిన 150 ఎకరాల స్థలంలో రూ.200 కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు. మొగళ్లపాలెంలో క్రీడా కాంప్లెక్స్​ అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని పేర్కొన్నారు. అక్కడ  అన్ని రకాల క్రీడాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.