LIVE: పద్మ విభూషణ్ వెంకయ్యనాయుడు మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - venkaiah Naidu Speech Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 10:41 AM IST
|Updated : Jan 26, 2024, 10:49 AM IST
Padma Vibhushan Venkaiah Naidu Live : ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురిని ఎంపిక చేసింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాల బాలికి, పద్మాసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు అనౌన్స్ చేసింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల (Padma Awards Winners 2024)ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనకు పద్మ విభూషణ్ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతలు మరింత పెంచిందని అన్నారు. రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలు చేశానని స్పష్టం చేశారు. తన సందేశాన్ని మీడియా ద్వారా దేశ ప్రజలకు తెలియజేస్తున్నారు.