అఖండ తెలుగుజ్యోతి ఆరిపోయింది - రామోజీకి వెంకయ్య నాయుడు అశ్రునివాళి - Venkaiah Naidu paid tribute Ramoji Rao - VENKAIAH NAIDU PAID TRIBUTE RAMOJI RAO
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 2:48 PM IST
|Updated : Jun 8, 2024, 3:28 PM IST
Venkaiah Naidu paid tribute to Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణవార్త విని ప్రముఖ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. రామోజీరావు స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు మృతి చెందడంతో హైదరాబాద్లోని ఫిలిం సిటీలో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Governor Bandaru Dattatreya paid tribute to Ramoji Rao : ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్థ అని ప్రశంసించారు. స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారని తెలిపారు. తెలుగు పత్రికారంగానికి కొత్త ఒరవడి నేర్పిన ఘనత రామోజీరావుదేనని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మరోవైపు తెలుగు పత్రికారంగంలో, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడని గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు.