ప్రచారంలో కన్నీటిపర్యంతమైన టీడీపీ అభ్యర్థి - Vemireddy Prashanthi Reddy - VEMIREDDY PRASHANTHI REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 4:06 PM IST
Vemireddy Prashanthi Reddy shed tears during election campaign: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టడంతో టీడీపీ మహిళలు స్పందించారు. కన్నీరు తుడిచి ఓదార్చారు. ఇటీవల వైసీపీ వ్యక్తిగత విమర్శలు, మరోవైపు ప్రజల ఆధారాబిమానాలు గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. వీధి కుక్కలు అరుస్తాయి తల్లి మీరు బాధపడకండి మీ వెంట మేముంటాం అని మహిళలు చూపిన ప్రేమకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కన్నీటి పర్వంతం అయ్యారు.
తామంతా అండగా ఉన్నామని అడుగడుగునా నీరాజనాలు పట్టారు. మహిళలు చూపిన ప్రేమకు మాటలతో భావోద్వేగానికి లోనయ్యారు. బుచ్చి మండలం చెల్లాయపాలెంలో ప్రచారం నిర్వహించిన వేమిరెడ్డి ప్రశాంతికి వేలాదిగా మహిళలు స్వాగతం పలికారు. అడుగడుగునా ఆమెకు సాదర స్వాగతం లభించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిపించుకుంటామని మహిళలు హామీ ఇచ్చారు. వైసీపీ అసత్య ఆరోపణలను తాము నమ్మబోమని తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చిన అంతరం మహిళా సమస్యలపై గొంతుతెత్తుతానని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.