thumbnail

ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు - అమ్మవారికి 102 కలశాలతో పూజలు - Vasavi kanyaka Parameswari Jayanti

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 10:48 PM IST

Vasavi Kanyaka Parameshwari Jayanthi 2024 : హైదరాబాద్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌ మహిళలు 102 కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జై పరమేశ్వరీ అంటూ లక్డీకాపూల్‌లోని వాసవీకేంద్రం వరకూ ఊరేగింపు సాగింది. వేడుకల్లో భాగంగా 102 కిలోల లడ్డూతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు.

కవాడిగూడలోని ముదిగొండ శంకరాధ్య మఠంలో మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వాసవీ సేవా కేంద్రంలో అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి 102 కిలోల లడ్డూను అలంకరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.