బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి 300 కేజీల స్వీట్స్‌తో అలంకరణ - BALKAMPET TEMPLE IN HYDERABAD - BALKAMPET TEMPLE IN HYDERABAD
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-10-2024/640-480-22626318-thumbnail-16x9-balkampet.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 7, 2024, 4:03 PM IST
Balkampet Yellamma Temple : శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు(అక్టోబర్ 07) న బల్కంపేట్ దేవాలయంలో ఎల్లమ్మ తల్లి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 300 కేజీల స్వీట్స్‌ను అమ్మవారిని నిర్వాహకులు సమర్పించారు. ఈ నేపథ్యంతో అన్నపూర్ణదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఈవో కృష్ణ మాట్లాడుతూ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణదేవి రూపంలో 300కేజీలతో అలంకరించామని తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి తగినన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఉచితంగా తీర్థ ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామని అన్నారు. అమ్మవారి అలంకరణలో ఉపయోగించిన స్వీట్స్‌ను భక్తులకు సైతం అందజేసే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళుతున్నారని తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రోజుకో విధంగా అలంకరిస్తున్నారు ఆలయ నిర్వాహకులు.