తేలప్రోలులో రెచ్చిపోయిన వంశీమోహన్​ అనుచరులు - టీడీపీ నేతపై దాడి, ఇద్దరికి స్వల్ప గాయాలు - YCP Leader Followers Attack - YCP LEADER FOLLOWERS ATTACK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 7:24 PM IST

Vamsi Mohan Followers Attack on TDP Leader Venkatrao: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో వివాదం చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కారుపై వైసీపీ అభ్యర్థి వంశీమోహన్​పై వరుసగా రెండోసారి దాడికి పాల్పడ్డారు. తేలప్రోలులో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని సందర్శించేందుకు వెంకట్రావు వెళ్లగా రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో వెంకట్రావు కారు అద్దాలు ధ్వంసమవ్వగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఓటమి భయంతోనే వంశీ తన అనుచరులతో దాడికి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక వంశీ భౌతిక దాడులు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. 

ఉదయం నున్న గ్రామంలో ఉన్న ఓటర్లను వైసీపీ పోలింగ్ ఏజెంట్ ప్రలోభాలకు గురి చేస్తున్నాడని వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వెంకట్రావును వెంబడించిన వంశీ అనుచరులు సూరంపల్లి బైపాస్ వద్ద దాడికి యత్నించారు. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల నేతలను పోలీసులు చెదరకొట్టారు. దీంతో గొడవకాస్త సద్దుమణిగింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.