తుంబిగనూరులో తప్పిన ముప్పు - తాగునీటి శుద్ధజల ట్యాంకులో పురుగులమందు - Poison on drinking water - POISON ON DRINKING WATER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 2:25 PM IST
Unknown Persons Mixed Pesticides in Drinking Water in Anantapur District : అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరులో గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగు నీటి శుద్ధ జల ట్యాంకులో రాత్రి పురుగుల మందు కలిపి పరారయ్యారు. ఉదయం తాగు నీటి కోసం వెళ్లిన స్థానికులకు వాసన రావటంతో ట్యాంక్ వద్దకు వెళ్లి చూడగా రసాయనిక మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
జూన్ 4న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించిదన్న అక్కసుతోనే వారు వైఎస్సార్సీపీ నాయకులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు తుంబిగనూరు గ్రామస్థులు ఆరోపించారు. ప్రజలు ఎవరూ ఆ తాగునీరు తాగక పోవటంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.