భార్య చూస్తుండగానే భర్త హత్య- 25 కత్తిపోట్లతో హతమార్చిన దుండగులు - nellore district murder
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 4:49 PM IST
Unknown Persons Killed a Man in Nellore District : భార్య కళ్ల ఎదుటే తన భర్తను అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. రామచంద్రాపురంలో ప్రసాద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ప్రసాద్ భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తు తెలియని యువకులు ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ శరీరంపై దాదాపు 25కు పైగా కత్తిపోట్లు ఉన్నాయి.
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరారు. ప్రవీణ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు. కళ్ల ఎదుటే భర్తను కోల్పోయిన భార్య, కుమారుడి మరణవార్త విన్న ప్రవీణ్ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ విషయంతో రామచంద్రాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.