వారాహి యాత్రలో పవన్‌పై రాళ్ల దాడికి యత్నం- యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - Stone Attack on Pawan Kalyan - STONE ATTACK ON PAWAN KALYAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 11:00 AM IST

Unknown Person Tried to Throw Stone on Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర (Pawan Kalyan Varahi Yatra) నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వారాహి యాత్రలో అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓ ఆగంతకుడు రాయి విసిరినట్లు కలకలం రేగింది. స్థానికులు, అభిమానులు ఆ యువకుడిని గుర్తించి పోలీసులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

పట్టణంలో రోడ్‌షో చెంచుపేట వద్దకు చేరుకోగానే అక్కడ ఓ యువకుడు తన చేతిలో ఏదో పట్టుకుని పవన్‌ కల్యాణ్‌ వైపు చూస్తూ విసురుతున్నట్లుగా జన సైనికులు అనుమానించారు. ఆ యువకుడిని పట్టుకుని మాట్లాడుతుండగానే పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని పక్కనున్న ఓ కల్యాణ మండపానికి తీసుకెళ్లి విచారించారు. అయితే ఆ యువకుడు విసిరింది రాయా లేక చెప్పా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు పొన్నూరు మండలానికి చెందిన దిలీప్‌గా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.