హనుమకొండ జిల్లాలో అమానుషం - అప్పుడే పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన వైనం - a baby girl found in Hanamkonda - A BABY GIRL FOUND IN HANAMKONDA
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 1:51 PM IST
|Updated : May 4, 2024, 2:18 PM IST
Child Was Buried Alive in Damera Mandal : కన్న తల్లి ఒడికి దూరమైన ఆ పసిబిడ్డను నేల తల్లి లాలించింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పసిగుడ్డును ప్రాణాలు పోకుండా ఆపింది. అచ్చం సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. దామెర మండలం ఉరుగొండ వద్ద తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు.
Buried Baby Girl in Hanamkonda : తెల్లారేదాకా మట్టిలో ఉండిపోయిన ఆ పసిగుడ్డు తనకే తెలియాని నరకాన్ని అనుభవించింది. అదే సమయంలో లారీ నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్, కదులుతున్న మట్టిని గమనించి, స్థానికులకు సమాచారం ఇచ్చారు. మట్టిని తవ్వి చూసేసరికి అందులో ఉన్న చిన్నారిని చూసి, అక్కడివారు ఉలిక్కిపడ్డారు. ప్రాణాలతో ఉన్న ఆడబిడ్డను బయటికి తీసి శుభ్రం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బతికుండగానే బిడ్డను పాతిపెట్టడం, మట్టితో కప్పేసినా ప్రాణాలతో ఉండటం, అదే సమయానికి వచ్చిన డ్రైవర్ చిన్నారికి ఊపిరిలూదిన ఈ ఘటన స్థానికుల హృదయాలను పిండేసింది.