'పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులన్నీ త్వరలో పట్టాలెక్కుతాయి' - minister Somanna to Madakasira - MINISTER SOMANNA TO MADAKASIRA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 8:37 PM IST

Union Minister Somanna to Visit Madakasira to Discuss Local Projects : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా నత్త నడక సాగుతున్న రైల్వే లైను పనులను కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న పరిశీలించారు. రాయదుర్గం నుంచి మడకశిర మీదుగా తుమకూరుకు రైల్వే లైన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రధాని ఆదేశాలతో పెండింగ్​లో ఉన్న పనులను 2026 లోపల పూర్తి చేసేందుకు పూనుకున్నామని మీడియా సమావేశంలో మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి పర్యటనలో హిందూపురం పార్లమెంట్ ఎంపీ పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. చెరువులు, చెక్ డ్యాముల మరమ్మతులకు, తాగునీటి సమస్యలు తీర్చేందుకు జలశక్తి శాఖ నుంచి నిధులు కేటాయించాలని వక్కలిగ, వాల్మీకి, బీసీ, ఎస్సీ, ఎస్టీల డిమాండ్లను పరిష్కరించాలని మంత్రిని కోరామని స్థానిక నాయకులు మీడియా ముఖంగా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.