సరికొత్తగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్ - 2026 నాటికి ఎలా ఉంటుందో తెలుసా? - Secunderabad station modernisation - SECUNDERABAD STATION MODERNISATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2024, 10:16 PM IST
Secunderabad Railway Station Redevelopment : తెలంగాణలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్కు మహర్దశ రాబోతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026లోపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రన్వీత్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 27 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
ప్రతిరోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారని, ఒక పక్క ప్యాసెంజర్లకు ఇబ్బందులు కలగకుండా, మరో పక్క స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర రైల్వే సహాయ మంత్రి రన్వీత్ సింగ్ పరిశీలించారు. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని ఆయన తెలిపారు. జనరల్ కోచ్ల ప్రాధాన్యత దృష్ట్యా 2 రైళ్లలో జనరల్ బోగీలను పెంచామని రన్వీత్ సింగ్ స్పష్టం చేశారు.